Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు పవర్ స్టార్. 2024లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కూటమి కట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ముందు చూపుతోనే కేంద్రంలో నరేంద్ర మోడీ, ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఓ రకంగా మన దేశంలో అసలుసిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారు.
అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా రికార్డు క్రియేట్ చేసారు. అంతేకాదు ఏపీలో ఏర్పడిన చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
రాజకీయాల్లో బిజీగా ఉండటంతో త్వరలో ఒప్పుకున్న చిత్రాలను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన మూడో భార్య అన్నా లెజ్నెవా పై అందరి దృష్టి పడింది.
అన్నా లెజ్నెవా విషయానికొస్తే.. ఈమె ఓ రష్యన్ మోడల్. 1980లో పుట్టిన ఈమె అనేక దక్షిణాది చిత్రాల్లో నటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్మార్ చిత్రంలో నటించింది.
‘తీన్ మార్’ సినిమా నుంచే పవన్, అన్నాల మధ్య ప్రేమ మొదలైంది. ఆ తర్వాత రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత 2013లో అన్నా లెజ్నోవాను పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నారు. మధ్యలో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే అని కొట్టిపారేసారు.
వీళ్లకు 2017లో కుమారుడు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించారు. అన్నా లెజ్నెవా అప్పటికే వివాహాం జరిగింది. మొదటి భర్తతో విడాకుల తర్వాత అన్నాలెజ్నోవాకు పవన్ కళ్యాణ్ తో రెండో పెళ్లి జరిగింది. అటు పవన్ కళ్యాన్ కు ఇది మూడో వివాహాం. వీరికో పాప ఉంది ఆమె పేరు అంజనా పాప్నోవా.
అన్నా లెజ్నెవాకు రష్యాలో మంచి సంపన్న కుటుంబం. ఓ వైపు మోడలింగ్, సినిమాలు, వారసత్వంగా వచ్చిన వ్యాపారాలు పలు హోటల్స్ ఉన్నాయి. ఈమెకు ఆస్తుల విలువ దాదాపు రూ. 1800 కోట్ల వరకు ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.