Renu Desai: మాజీ భర్త బాటలో రేణు దేశాయ్..?.. ఇక మీదట అలా చేయోద్దంటూ సంచలన వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..?
ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే కాకుండా.. మన ధర్మంను కాపాడుకొవడం కోసం ఎంత దూరమైన వెళ్లేందుకు వెనుకాడేదని లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీజేపీ సైతం.. పవన్ కు మహా ఎన్నికలలో కీలక బాధ్యతలు అప్పగించింది.
పవన్ తనకు అప్పగించిన బాధ్యతల్ని.. అదిరిపోయే విధంగా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి కేంద్రంకు మహాలో భారీ విజయం అందించారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం.. తాజాగా, నర్సింహ వారాహి గణం పేరుతో జనసేన ఇటీవల కొత్త విభాగంను సైతం ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల రేణుదేశాయ్ తల్లి మరణించారు. అయితే.. ఆమె తన ఇన్ స్టాలో వేదికగా తన తల్లి ఫోటోను షేర్ చేసి.. పుట్టిన వారికి మరణం తప్పదు.. అన్న శ్లోకాన్ని జతపర్చారు. ఈ క్రమంలో చాలా మంది నెటిజన్లు దానికి రిప్, రెస్ట్ ఇన్ పీఎస్ అంటూ కామెంట్లు పెట్టారంట.
దీనికి తాజాగా, రేణు దేశాయ్.. మన సనాతన ధర్మంప్రకారం.. ఓంశాంతి.. లేదా సద్గతి ప్రాప్తిరస్థు, ఉత్తర లోక ప్రార్థిరస్తు.. ఇలా కామెంట్లు చేయాలని చెప్పారంట. ఇదే మన ధర్మం.. అని ఆమెకు పండితులు చెప్పారంట. అదే విధంగా రేణు దేశాయ్ కూడా నెటిజన్లకు చెప్పారంట.
అదే విధంగా మన సనాతన ధర్మం ప్రకారం.. మనం భాషను ఉపయోగించుకొవాలని అన్నారంట. దీంతో నెటిజన్లు ప్రస్తుతం రేణు దేశాయ్.. పవన్ తో విడిపోయిన కూడా.. ఆయన బాటలోనే సనాతన ధర్మం కోసం ముందుకు వెళ్తుందని కూడా కామెంట్లు చేస్తున్నారంట.
కొన్నినెలల క్రితం రేణు దేశాయ్ తన ఇంట్లో ఒక హోమం చేసిన విషయం తెలిసిందే. పవన్ తో వేరుగా ఉన్న కూడా.. తన మాజీ భర్త అడుగు జాడల్లోనే ఇంకా రేణు నడుస్తుందని కొందరు నెటిజన్ లు అంటున్నారంట. ప్రస్తుతం రేణుదేశాయ్ సనాతర ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్ గా మారాయి.