Pawan Kalyan: `ఓజీ` అప్‌డేట్ అడిగిన అభిమానులపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. నేను మీసం తిప్పితే పనులు జరగవు
మన్యం జిల్లాలో: మన్యం పార్వతీపురం జిల్లాల్లో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం పర్యటించారు.
రోడ్ల పనులు: దాదాపు రూ.36.71 కోట్ల వ్యయంతో 19 నూతన రోడ్లకు సాలూరు నియోజకవర్గం బాగుజోలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపనలు చేశారు.
ఓజీపై అప్‌డేట్: వెంగళరాయసాగర్ ప్రాంతంలో నడుచుకొంటూ వెళ్తున్న సమయంలో అభిమానులు గోల చేశారు. ఓజీ.. ఓజీ అంటూ సినిమా అప్‌డేట్ అడిగారు.
తీవ్ర ఆగ్రహం: అభిమానుల నినాదాలపై పవన్ కల్యాణ్ చిర్రెత్తెక్కారు. ‘నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను' అని అభిమానులపై మండిపడ్డారు.
సినిమా మోజులో: 'ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు' అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనులు జరగవు: 'నేను మీసం తిప్పితే పనులు జరగవు’ అని అభిమానులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.