Pawan Kalyan Meet Modi: ప్రధాని మోదీని కలిసిన జనసేనాని.. ఫోటోస్ తెగ వైరల్..

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి గురించి కూడా మాట్లాడినట్లు సమాచారం. ఇరువురు మధ్య జరిగిన చర్చల్లో ఏపీకి సంబంధించిన చాలా రకాల అంశలపై మాట్లాడారని అధికార వర్గాల్లో చర్చ.

ప్రస్తుతం ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలవడంతో ఏపీలో రాజకీయాలు వేడెకుత్తున్నాయి. అంతేకాకుండా పొత్తుల వ్యవహారం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. అయితే ఇద్దరు కలిసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వైజాగ్ హోటల్‌లో జరిన పవన్ ప్రెస్ మీట్‌లో ఇలా అన్నారు..'' 2 రోజుల క్రితమే పవన్‌ను కలవాలని పీఎంవో నుంచి పిలుపు వచ్చిందని ఆయన తెలిపారు'' ప్రధాన అయిన తర్వాత రెండవ సారి కలిసారని దాదాపు 8 ఏళ్ల అవుతుందని ఆయన అన్నారు.
నిన్న ప్రధాని మోదీని కలిసిన తర్వాత జరిగిన పవన్ ప్రెస్ మీట్‌లో ఓ ఆసక్తికరమైన ప్రకటన కూడా చేశారు జనసేన అధ్యక్షుడు. అయితే త్వరలోనే ఏపీకి మంచి రోజులు వస్తాయని.. ప్రజలు ఓపికతో ఉండాలని ఆయన చెప్పారు.
ప్రధాని వైజాగ్ పర్యటన భాగంగా మోదీని కలిసిన పవన్ కళ్యాణ్ రాజకీయ విషయాల గురించి చర్చించారు. అంతేకాకుండా ఆ హోటల్ నుంచే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.