Pawan kalyan: రేవంత్‌తో భేటీ అయిన ఏపీ డిప్యూటీ సీఎం.. కారణం ఏంటంటే..?
ఇటీవల కురిసిన వర్షాలకు రెండు తెలుగు స్టేట్స్ లు సైతం అతాలాకుతలం అయ్యాయి. అంతే కాకుండా.. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడలు వరదలకు కుదేలయ్యాయి. తెలంగాణలో మున్నేరు, ఆంధ్ర ప్రదేశ్ లో బుడమేరు పొంగిపొర్లడంతో అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి.
ఈ క్రమంలోనే అనేక అపార్ట్ మెంట్ లు సైతం నీళ్లలోకి మునిగిపోయాయి. చాలా మంది ప్రజలు కట్టుబట్టలతో బైటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక ప్రాంతాలలో ప్రజలు.. రెండో,మూడో అంతస్థు మీద నిలబడి తమ ప్రాణాలను సైతం కాపాడుకున్నారు.
వరద ప్రాంతాలలో ఇరు తెలుగుస్టేట్స్ ల సీఎంలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటించారు. మరోవైపు.. చంద్రబాబు పదిరోజుల పాటు విజయవాడలో కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి అధికారులు, మంత్రుల్ని పరుగులు పెట్టించారు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాలకు సైతం విరాళాలు వెల్లువెత్తాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకు చెరో కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించారు. దీనిలో భాగంగా ఇదివరకే ఏపీ సీఎం చంద్రబాబును కలిసి.. కోటి రూపాయల చెక్ ను అందజేశారు.
ఈరోజు (బుధవారం) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసస్థలానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అంతేకాకుండా.. తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయం కోసం.. ఇది వరకు ప్రకటన మేరకు.. కోటీ రూపాయల చెక్ ను అందజేశారు.
మరోవైపు రెండు తెలుగు స్టేట్స్ లకు అన్నిరంగాల నుంచి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. కేంద్రం కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకు కేంద్రం... 3300 కోట్లను తన వంతుగా వరద సహాయం అందించిన విషయం తెలిసిందే