Karthi Vs Pawan Kalyan: కార్తీ అన్న దాంట్లో నిజంగా తప్పుందా..? సెన్సిటివ్ అనే పదానికి పవన్ కి అర్థం తెలీదా?
తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ సుపరిచితుడే. తెలుగు హీరోలను అభిమానించినట్టే.. తమిళ హీరోలు సూర్యని, సూర్య తమ్ముడు కార్తీని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. అందుకు ముఖ్య కారణం ఈ ఇద్దరు హీరోలు కూడా వివాదాలకు ఎంతో దూరంగా ఉండడం. అంతేకాకుండా ఈ ఇద్దరి హీరోల.. మాట తీరు కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఎక్కడ గాని అతిగా రియాక్ట్ అవ్వరు.
కానీ అలాంటి కార్తీ ఈరోజు పవన్ కళ్యాణ్ ని క్షమాపణ అడగాల్సి వచ్చింది. అసలు విషయానికి వస్తే.. తిరుమల లడ్డు గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. స్వామివారి లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలిపారు.. అనే రిపోర్ట్ వచ్చిన దగ్గరనుంచి.. ప్రతి ఒక్కరూ ఈ పని జరిగిన దానికి చింతిస్తున్నారు.
కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇలా జరగడం.. ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయమే. కానీ ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు స్పందిస్తున్న తీరు మాత్రం.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కళ్యాణ్ లడ్డు అపవిత్రమైనందుకు 11 రోజులు దీక్ష తీసుకున్నారు. అలానే ఈ విషయాన్ని సెంట్రల్ వరకు తీసుకుపోవాలని.. ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇవన్నీ కూడా మంచి విషయాలే.
అయితే ఇక్కడితో ఆగకుండా.. అనవసరమైన చిన్న చిన్న మాటలకి కూడా పవన్ అతిగా స్పందిస్తున్నారు.. అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకు ముఖ్య కారణం నిన్న ఒక ఈవెంట్లో యాంకర్ లడ్డు కావాలా నాయనా అని అడగగా.. అందుకు సమాధానంగా హీరో కార్తీ” ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దండి.. అది సెన్సిటివ్ టాపిక్,” అని చెప్పుకొచ్చారు.
నిజానికి కార్తీ అన్నమాట అక్షరాల నిజమే. వెంకటేశ్వర స్వామిని నమ్మే ఎంతోమందికి లడ్డు అనేది సెన్సిటివ్ టాపిక్. అలాంటి మహా ప్రసాదంలో.. యానిమల్ ఫ్యాట్ ఉందన్న నెయ్యి కలపడం.. అనేది ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసిన విషయం. అందుకే కార్తీ ఈ విషయాన్ని సెన్సిటివ్ అన్నారు. కార్తీ అన్న పదంలో అంత సత్యం ఉన్నా కానీ.. పవన్ మాత్రం అనవసరంగా లడ్డుని సెన్సిటివ్ అనొద్దని.. అసలు అలా అనే సాహసం చేయొద్దని.. సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించమని.. హెచ్చరించారు.
కార్తీ అక్కడ ఎక్కడ కానీ సనాతన ధర్మంని.. కించపరిచేలా మాట్లాడలేదు. అంతేకాదు అసలు పవన్ కి సెన్సిటివ్ అనే పదానికి అర్థం తెలుసా లేదా అనేది కూడా ఎంతోమంది సందేహం. ఎందుకంటే నిజంగానే వెంకటేశ్వర స్వామి భక్తులకు లడ్డు అనేది సెన్సిటివ్ విషయం కాగా.. పవన్ ఎందుకు దాన్ని సెన్సిటివ్ అనొద్దన్నారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక తను ఎటువంటి తప్పు మాట అనకపోయినా.. కార్తీ క్షమాపణలు.. చెప్పి తన హుందాతనాన్ని చూపించారు. మరి పవన్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఎందుకు అనవసరమైన హీరోయిజం చూపిస్తున్నారని.. నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఎంతోమంది పవన్ కళ్యాణ్ ఈ లడ్డు విషయాన్ని తన స్వార్థం కోసం వాడుకోకుండా.. తిరుమల విషయంలో ఇకమీదట ఎప్పుడూ ఇలా జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండని.. తన హీరోయిజం అలాంటి దగ్గర చూపిస్తే.. అందరూ సంతోషిస్తారని అంటున్నారు.