Gamanam: గమనం ట్రైలర్‌‌ను రిలీజ్ చేసి వీక్షించిన జనసేనానీ.. ఫొటోలు

Thu, 12 Nov 2020-12:30 pm,

అయితే ఐదు భాషల్లో తెరకెక్కుతున్న గమనం.. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను పవన్ కల్యాణ్ విడుదల చేయగా..హిందీలో సోనూ సూద్ (Sonu Sood)‌, మలయాళంలో ఫహాద్‌ ఫాజిల్‌, కన్నడలో శివకుమార్‌, తమిళంలో జయం రవి విడుదల చేశారు.  

అయితే గమనం సినిమా ట్రైలర్‌తోపాటు.. పోస్టర్లు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈ చిత్రంలో శ్రియ, శివ కందుకూరి, ప్రియాంకా జవాల్కర్‌, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రియ ఈ చిత్రంలో మూగ పాత్రలో కనిపించనుంది. మూడు సాధారణ కథల ఆధారంగా మధ్యతరగతి కుటుంబాల పరిస్థితులను ఈ చిత్రంలో చూపించనున్నారు దర్శకురాలు సుజనారావు. 

ఈ చిత్రాన్ని వి.ఎస్‌. జ్ఞానశేఖర్‌, వెంకీ పుషడపు, రమేశ్‌ కరుటూరి నిర్మిస్తుండగా..  మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతాన్ని అందిస్తున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link