Akira Nandan Birthday : అకిరా నందన్ బర్త్ డే స్పెషల్.. జూ. పవర్ స్టార్ రేర్ పిక్స్
టాలీవుడ్‌లో ఏప్రిల్ 8 అనేది ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. అల్లు అర్జున్, అఖిల్, అకిరా నందన్ ఇలా చాలా మంది బర్త్ డేలుంటాయి. అక్కినేని,మెగా, అల్లు వారి అభిమానులకు ఈ రోజు ప్రత్యేకంగా నిలిచింది. నేడు సోషల్ మీడియాలో ఈ ముగ్గురి పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్ తనయుడిగా, జూ. పవర్ స్టార్‌గా అకిరా నందన్ పేరు ఇప్పటికే ఎక్కువగా ట్రెండ్ అవుతుంటుంది. అకిరా నందన్‌కు ఇప్పుడే ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. అకిరా వీడియోలు, ఫోటోలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.
అకిరా నందన్ సినీ ఎంట్రీ గురించి ఇప్పటికే ఎన్నో రూమర్లు వచ్చాయి. వాటిపై రేణూ దేశాయ్ ఎన్నో సార్లు స్పందించింది. అకిరా ఏం అవ్వాలనుకుంటున్నాడో అనే క్లారిటీ ఇంకా లేదని, ఒకసారి ఫుల్ బాల్ అంటాడని, ఇంకోసారి మ్యూజిక్ అంటాడని, మరోసారి ఉన్నత చదువులని అంటాడట.
అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, చిరంజీవిలతో అకిరా నందన్ ఉన్న ఫోటోలను ఫ్యాన్స్ నెట్టింట్లో షేర్లు చేస్తున్నారు.
అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా రేణూ దేశాయ్ ఏదో ఒక వీడియో, ఫోటోను షేర్ చేస్తుంటుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. మెగా హీరోల్లోంచి కేవలం సాయి ధరమ్ తేజ్ మాత్రమే స్పెషల్‌గా విషెస్ అందించాడు.