Pawan kalyan: మరోసారి కూతురి ముచ్చట తీర్చిన పవన్ కళ్యాణ్.. ఏం చేశారో తెలుసా..?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోమారు తన బిడ్డ ఆద్యను సర్ ప్రైజ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలను సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ ఉన్న ప్రత్యేకమైన ఉత్పత్తులను ఆసక్తిగా గమనించారు.
అంతేకాకుండా.. వస్త్రాలతో తయారు చేసిన బ్యాగ్ లు, కొయ్యబొమ్మల్ని సైతం ఆద్య ఎంతో ముచ్చటగా కూడా చూశారు. అక్కడ ఆద్య లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను ఎంతో ఆసక్తిగా చూస్తుంది. జ్యూట్ బ్యాగ్ లు, బొమ్మల్ని ఇష్టంతో చూస్తుంది.
ఆమె ఇష్టాన్ని గమనించిన పవన్ కళ్యాణ్.. వెంటనే.. తనకూతురుకు జ్యూట్ బ్యాగ్ లు, కొయ్యబొమ్మల్ని ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. అక్కడి అధికారులు.. పవన్ కళ్యాణ్ తోపాటు.. ఆద్యను కూడా సన్మానించి ప్రత్యేకంగా అక్కడ ప్రదర్శనలో ఉంచిన కొన్ని కళంకారిబొమ్మల్ని, కొయ్య బొమ్నల్ని సైతం.. పవన్ తో పాటు, ఆద్యకు కూడా ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.
ఇదిలా ఉండగా.. లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలను పవన్ కళ్యాణ్ ఈరోజు(శుక్రవారం) తన కూతురు ఆద్యతో వెళ్లి పరిశీలించారు. అక్కడ.. అతిథుల గౌరవార్థం జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకొన్నారు. మిగతా.. 60 శాతం తన సొంత సొమ్మును కలుపుకుని కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని తన అక్కడి అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
హస్తకళలను ప్రొత్సహించి.. ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలని పవన్ అన్నారు. ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర, అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ సూచించారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్.. శ్రీకాళహస్తి పెన్ కలంకారీ వస్త్రాలు, నరసాపురం లేసు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలతో చేసి దశావతారాలు, ధర్మవరం తోలుబొమ్మలు, బొబ్బిలి వీణ జ్ఞాపికలు, చిత్తూరు కొయ్య కళాకృతులూ, సవర గిరిజనులు వేసిన చిత్రాలలను పరిశీలించారు.
అంతేకాకుండా.. మంగళగిరి శాలువాలు, అరకుకాఫీ, దుర్గి రాతిబొమ్మలు, అనేక కళాకృతులు పరిశీలించారు. ఆద్య అందులో కలంకారీ వస్త్రంతో చేసిన బ్యాగ్, కొయ్య బొమ్మలు చూసి ముచ్చటపడ్డారు. దీంతో పవన్.. వాటిని కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి బిల్లు చెల్లించి బ్యాగ్, బొమ్మలు కొని తన కుమార్తెకు అందించారు.