Rakshana OTT News: పాయల్‌ రాజ్‌పుత్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ `రక్షణ` ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌.

Thu, 01 Aug 2024-9:19 am,

పాయల్ రాజ్ పుత్ తెలుగులో RX 100 మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ భామగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె లీడ్ రోల్లో ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘రక్షణ’. ఈ సినిమాను ఆయనే నిర్మించడం విశేషం.

జూన్ 7న ఈ సినిమా విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఆహాలో ఆగష్టు 1 నుంచి (నేటి) నుంచి ఈ సినిమా  స్ట్రీమింగ్ అవుతోంది.

నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్.. ‘లేడీ సింగం’గా తన పాత్రలో జీవించింది. కథ, కథనం ఈమె నటన ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు మానస్ నాగులపల్లి,  రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి యంగ్ కంపోజర్ మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చారు.

 

ఈ వీకెండ్ ఓటీటీ ఎంటర్టైన్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్రేక్షకులకు ‘ఆహా’ ఓటీటీలో ‘రక్షణ’ మూవీ ఫస్ట్ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link