Peepal Tree Benefits: రావిచెట్టు ఆకులు, బెరడు, పండ్లలో అద్భుత ఔషధ గుణాలు, అన్ని సమస్యలకు చెక్
రావిచెట్టు పండిపోయిన పండ్లను ఎండబెట్టి పౌడర్ చేసుకుని తేనెతో కలిపి తీసుకుంటే నత్తి సమస్య కూడా దూరమౌతుంది.
రావిచెట్టు ఆకులు, బెరడులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ రావిచెట్టు లేత ఆకుల్ని నమిలి తింటే ఒత్తిడి దూరమౌతుంది. వయస్సుతో పాటు వచ్చే వృద్ధాప్య లక్షణాల్ని దూరం చేస్తుంది. రావిచెట్టు ఆకుల రసంతో పాదాల్లో పగుళ్ల సమస్య దూరం చేయవచ్చు.
రావిచెట్టు ఆకుల రసంతో జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. లేదా రావిచెట్టు ఎండిన ఆకుల పొడితో కాడా చేసుకుని తాగవచ్చు. రావిచెట్టు ఆకుల రసంతో మసాజ్ చేయడం వల్ల చర్మం అందంగా మారుతుంది. చర్మంపై ముడతలు దూరమౌతాయి.
రావిచెట్టు పుల్లలతో పళ్లు తోముకుంటే పంటి సంబంధిత సమస్యలు దూరమౌతాయి. పళ్లను పటిష్టం చేస్తాయి. పంటి నొప్పి నుంచి ఉపశమనం కల్గిస్తాయి. విష కీటకాలు కుట్టినప్పుడు రావిచెట్టు ఆకుల రసంతో తక్షణం ఉపశమనం కల్గించవచ్చు.
ఆయుర్వేదం ప్రకారం రావిచెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేస్తాయి. రావి చెట్టు ఆకుల్లో పిత్తాన్ని నాశనం చేసే గుణాలుంటాయి. కడుపు సంబంధిత వ్యాధులు దూరమౌతాయి. గ్యాస్ సమస్య ఉండదు. మలబద్ధకం సమస్య దూరమౌతుంది.