Rahu Transit: ఈ తేదిల్లో పుట్టినవారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారు.. మీరున్నారా..!

Wed, 02 Oct 2024-3:28 pm,

సంఖ్యాశాస్త్రం ప్రకారం రాహువు 4వ సంఖ్యకు  అధిపతి. ఈ  కారణంగా ఈ వ్యక్తుల జీవితాలపై రాహువు ప్రత్యేక ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయని సంఖ్యా శాస్త్రం చెబుతుంది. అంతేకాదు ఈ తేదిల్లో పుట్టిన వారిపై రాహువు ఈ వ్యక్తుల పట్ల ఎపుడు దయ చూపుతూ ఉంటాడట.

4వ సంఖ్యపై రాహువు ప్రభావం.. వ్యక్తి పుట్టిన తేది నుంచి వాళ్ల స్వభావంతో పాటు వాళ్ల ప్రవర్తన, వివాహా జీవితం, వృత్తి, వ్యాపారుల వల్ల ఆర్ధిక స్థితిగతులు పూర్తిగా మారుతాయి.

గ్రహాల్లో  రాహువు క్రూరమైనదిగా అభివర్ణిస్తున్నారు. 4వ సంఖ్య కి అధిపతి. ఏదైనా నెలలో 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వారు పుట్టినపుడు పేదరికంలో ఉన్నా.. ఆ తర్వాత కోటీశ్వరులుగా మారుతారని సంఖ్యా శాస్త్రం చెబుతుంది. 

రాహువు వల్ల జీవితంలో మొదట ఇబ్బందులను ఫేస్ చేసినా.. ఆ తర్వాత జీవితంలో అపారమైన పురోగతిని సాధిస్తారు.  సాధారణంగా, రాహువు ప్రభావం ఉన్న వ్యక్తులు 42 యేళ్ల తర్వాత కానీ జీవితంలో సరైన విజయాన్ని అందుకుంటారు. మరో విచిత్రమైన  విషయం ఏమిటంటే..రాహువు ఆకస్మిక రాశి మార్పు ఒక వ్యక్తి రాత్రికి రాత్రే విజయం సాధించే అవకాశం ఉంది. మరి కోటీశ్వరులు అవుతారని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్న మాట. 

ఇక 4వ తేదిలో పుట్టిన వ్యక్తులు ఏ విషయంలోనైనా ప్లానింగ్ తో ముందుకు వెళతారు. ఎల్లప్పుడూ ఆచరణాత్మకంగా ముందుకు వెళతారు. స్వభావంలో  కొద్దిగా రహస్యంగా ఉంటారు. తమ భావాలను పంచుకోవడంలో మాట్లాడటంలోనూ, వ్యక్త పరచటంలోనూ ముందుంటారు.

4వ తేదిలో పుట్టిన వ్యక్తులు వీలైనంత త్వరగా పురోగతిని సాధింస్తారు. అంతేకాదు ఎపుడు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ముందుగా అశుభ ఫలితాలను అందించినా.. ఆ తర్వాత జీవితంలో మంచి ఫలితాలను అందుకుంటారు.

 

గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు మరియు విలువలను కలిగి ఉంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link