చిత్ర మాలిక: పెప్సికోలో ఇంద్ర నూయి శకానికి తెర
ఇంద్ర నూయి (62), 24 ఏళ్ల తర్వాత అక్టోబర్ 3న పెప్సీకో సీఈవో బాధ్యతలకు గుడ్‌బై చెప్పనున్నారు.
‘ప్రపంచంలో శక్తివంతమైన వ్యాపార మహిళ’ (అమెరికా వెలుపల)గా ఫార్చ్యూన్స్ జాబితా 2017లో 2వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో టాప్–100 శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా 2014లో ఫోర్బ్స్ జాబితాలో 13వ స్థానంలో నిలిచారు.
అత్యధిక పారితోషికం అందుకునే మహిళా సీఈవోగానూ అగ్ర స్థానంలో ఉన్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థను నడిపించిన భారత మహిళామణుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించారు.
మద్రాస్‌లో జన్మించిన ఇంద్రా కృష్ణమూర్తి నూయి పెప్సికోలో 1994లో చేరి.. అంచలంచెలుగా ఎదుగుతూ 2006లో కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2007లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ తో ఆమెను సత్కరించింది.
44 ఏళ్ల పెప్సీకో కంపెనీకి ఇంద్ర నూయి ఐదో సీఈవో. పెప్సీకోతో 24 ఏళ్ల ప్రయాణం ఆమెది. 12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించారు.