Perugannam Benefits: పెరుగన్నం తింటే వానా కాలంలో బోలెడు లాభాలు..
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తాయి.
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం ఎముకలను దృఢంగా తయారు చేస్తుంది. అంతేకాకుండా ఎముకలు బలహీనపడటం, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ ఉండేలా చేస్తుంది. ఇది ముఖ్యంగా మొటిమలు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
పెరుగులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రతి రోజు పెరుగన్నం చిన్న కప్పుతో తినడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.
పెరుగులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెరోటోనిన్ మనోవేదనను తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
పెరుగులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. గుండె సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.