Petrol, diesel prices today: రికార్డు స్థాయికి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. టాప్ 7 లిస్టులో తెలంగాణ, ఏపీ

Sun, 20 Jun 2021-2:13 pm,

ధరల పెంపు అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర (Petrol prices in Delhi today) రూ.97.22 కాగా డీజిల్ ధర రూ 87.97 కు పెరిగింది. (Representational image)

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.36 రికార్డు స్థాయికి చేరింది (Petrol prices in Mumbai today). అలాగే డీజిల్ ధర 95.44 మార్కును తాకింది. (Representational image)

మెట్రో సిటీల్లో ఒకటైన చెన్నైలో పెట్రోల్ ధర (Petrol prices in Chennai today) లీటర్‌కు రూ.98.40 కాగా డీజిల్ ధర రూ. 92.58 గా ఉంది. (Image credits: Reuters) 

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర (Petrol prices in Kolkata today) రూ.97.12 కు పెరగగా.. డీజిల్ ధర 90.82 కు చేరింది. (Representational image)

దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో (Petrol prices in Madhya Pradesh today) లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ. 105.33 కు పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ.96.95 కు పెరిగింది. (Representational image)

తెలంగాణ (Petrol prices in Telangana today), ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో పెట్రోల్ ధరలు రూ.100 మార్క్ తాకాయి. (Representational image)

పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండటానికి కారణం ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న VAT, ఫ్రైట్ చార్జీలే. (Representational image)

పెట్రోల్, డీజిల్ పై రాజస్థాన్‌లో అత్యధిక వ్యాట్ (VAT on petrol in Rajastan) వసూలు చేస్తుండగా ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ (Petrol prices in Andhra Pradesh today), తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. (Representational image)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link