Petrol prices today in Hyderabad: మళ్లీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol and diesel prices today in Hyderabad: మూడు రోజుల క్రితం వరకు నాలుగు రోజుల పాటు పెరగకుండా నిలకడగా ఉన్న పెట్రోల్, Diesel prices గత మూడు రోజులుగా మళ్లీ పెరుగుదల బాటపట్టాయి.
ఏరోజుకు ఆరోజు స్వల్ప పెరుగుదలే కనిపిస్తున్నప్పటికీ... హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో మొత్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ 1.58 మేర పెరిగింది. అంటే ఫిబ్రవరి 3న హైదరాబాద్ లో రూ.89.77 గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర.. నేడు ఫిబ్రవరి 11న రూ.91.35 కి చేరింది.
హైదరాబాద్‌లో నిన్న రూ. 91.09 గా ఉన్న లీటర్ Petrol price నేడు 26 పైసలు పెరిగి 91.35 రూపాయలకి చేరింది.
అలాగే డీజిల్ ధరలు (Diesel prices) సైతం అదే స్థాయిలో నెమ్మదిగా పైకి ఎగబాకుతున్నాయి. వారం రోజుల క్రితంతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో లీటర్ డిజిల్ ధర ఇప్పటివరకు రూ.1.65 మేర పెరిగింది.
ఫిబ్రవరి 3న 83 రూపాయల 46 పైసల వద్ద ఉన్న లీటల్ డీజిల్ ధర నేడు 85.11 రూపాయలకు చేరింది.
హైదరాబాద్‌లో నిన్నటికి, ఇవాళ్టికే లీటర్ డిజిల్ ధర 32 పైసలు మేర పెరిగింది. క్రమక్రమంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులను, సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Also read : Rs 5, 10 and 100 notes: రూ. 5, 10, 100 పాత నోట్లు రద్దు చేస్తారా ?
పెరుగుతున్న Petrol prices కు సమానంగా డీజిల్ ధరలు సైతం పెరుగుతుండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. Diesel prices పెంపు కారణంగా సరుకు రవాణా ధరలు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని సామాన్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Also read : LPG Price hiked: భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు.. ఇకపై LPG కి ఎంత Pay చేయాలంటే..
Also read : అందాల రాశి Rashi Khanna స్విమ్మింగ్ ఫూల్ photo shoot