PF Account Guidelines: ఇక నుంచి ఒకటే పీఎఫ్ ఎక్కౌంట్, ఎక్కువుంటే విలీనం చేసుకోవల్సిందే
రెండు ఖాతాలు ఉంటే మూసివేసిన అకౌంట్లో ఉన్న మొత్తాన్ని వారు నిర్వహించాలనుకుంటున్న అకౌంట్‌కు బదిలీ చేస్తారు. పోస్టాఫీసులు, బ్యాంకుల ఖాతాలు కొనసాగించాలనుకునే డిపాజిటర్లు పాస్‌బుక్, బ్యాంకు స్టేట్‌మెంట్ కాపీలతో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. వారు పరిశీలిస్తారు.
ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలను గుర్తించబోమని కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఏదైనా పీపీఎఫ్ లోన్ అకౌంట్ ఉన్నట్లయితే విలీనం చేయడానికి ముందు దానిని మూసివేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఏ ఖాతాను క్లోజ్ చేయాలో డిపాజిటర్ ఇష్టమని తెలిపింది.
ఒకవేళ ఇప్పటికే ఒకటి కన్నా ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు ఉన్నట్లయితే వాటన్నింటినీ విలీనం చేసి ఒకే అకౌంట్ కింద మార్చుకోవాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తూ విలీనంపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
పీపీఎఫ్ ఎక్కౌంట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్నట్టు ఇక నుంచి ఒక వ్యక్తి పలు పీపీఎఫ్ ఎక్కౌంట్లను కలిగి ఉండేందుకు వీలులేదు.