భారత్‌లో త్వరలో Pfizer Covid-19 Vaccine కానీ..
అమెరికాకు చెందిన ఫార్మ దిగ్గజం భారత దేశంలో వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ మేరకు భారత డ్రగ్ రెగ్యులేటర్ అయిన DGCI అంటే Drugs Controller General Of India నుంచి అనుమతి కోసం వేచి చూస్తోంది.
ప్రస్తుతం యూకేతో పాటు బహ్రెయిన్ వాసులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.జ
డిసెంబర్ 4వ తేదీని భారత డ్రగ్ కంట్రోలర్ డీజీసిఐ నుంచి అనుమతి కోరుతూ క్లినికల్ ట్రయల్స్ అవసరం లేకుండా చూడాలని కోరింది. భారత ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఇవ్వమని కోరింది.
అయితే భారత దేశంలో ఏ వ్యాక్సిన్ అయినా తప్పకుండా క్లినికల్ ట్రయల్స్ తరువాత అనుమతి పొందుతుంది.. దాంతో ఫైజర్ వ్యాక్సిన్‌కు కూడా ఇదే వర్తిస్తుంది అని అన్నారు.
భారత ప్రభుత్వం నిర్ణయాన్ని గౌరవిస్తూ భారత ప్రజల మేలు కోరుతున్నాం అనుమతి కోసం వేచి చూస్తున్నాం అని ఫైజర్ తెలిపింది.
ఆ అనుమతి లభిస్తే భారతీయులకు గొప్పవరంగా భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సమారు 96 లక్షల మందికి కరోనావైరస్ సోకింది. దాంతో పాటు సెకండ్ వేవ్ కూడా మళ్లీ మొదలైంది.