Phonepe: ఫోన్ పే దివాళీ బంపర్ ఆఫర్.. రూ.9 తో రూ.25వేలు లాభం..!
సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా బీమా పాలసీ తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న విషయం తెలిసిందే. ఊహించని ప్రమాదాలు, అనారోగ్య సమస్యల సమయంలో ఈ ఆరోగ్య బీమా పాలసీ ఎంతగానో ఉపయోగపడతాయి.
ముఖ్యంగా ఇంటికి పెద్ద మరణించినప్పుడు అదే బీమా పాలసీ ఆ కుటుంబానికి ఆర్థిక అండగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు . ఈ క్రమంలోని దీపావళి సందర్భంగా ఫోన్ పే కొత్త తరహా బీమా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది
గత కొన్ని సంవత్సరాలుగా దీపావళి సందర్భంగా చాలామంది పటాసుల కారణంగా ప్రాణాలు విడుస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారి కోసం ఫోన్ పే తీసుకొచ్చిన ఈ కొత్త బీమా పాలసీ కాస్త ఊరటను కలిగించబోతుందని చెప్పవచ్చు. ఫోన్ పే కొత్త తరహా బీమా పాలసీ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో గాయపడే వారి కోసమే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం.
పండుగ సెలబ్రేషన్స్ లో భాగంగా గాయపడిన వారికి బీమా కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త తరహా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీపావళికి కాల్చే టపాసుల కారణంగా ఎవరైనా గాయపడితే అలాంటి వారికి ఈ బీమా అండగా ఉంటుంది. కేవలం 9 రూపాయల ను చెల్లించడం వల్ల బీమా పాలసీ ద్వారా రూ.25 వేల వరకు కవరేజీ పొందవచ్చు. అక్టోబర్ 25 నుంచి దాదాపు పది రోజుల వ్యాలిడిటీతో ఈ బీమా పాలసీ పథకాన్ని తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ఫోన్ పే అకౌంట్ హోల్డర్ తో పాటు అతడి కుటుంబం సభ్యులు నలుగురికి ఈ బీమా కవరేజీ వర్తిస్తుందని సమాచారం.
ఈ పాలసీ పొందాలి అనుకున్న వారు 9 రూపాయలు చెల్లిస్తే చాలు ఈ పథకం ఆక్టివేట్ అవుతుంది. దీపావళి పండుగ నేపథ్యంలో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తో కలిసి ఫోన్ పే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది. పథకానికి ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వస్తే.. ఫోన్ పే లోని ఇన్సూరెన్స్ సెక్షన్ లోకి వెళ్లి ఫైర్ క్రాకర్ ఇన్సూరెన్స్ పైన క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలను అందించి పాలసీ తీసుకోవాలి. తొమ్మిది రూపాయలతో బీమా ప్రీమియం తీసుకుంటే రూ.25 వేల వరకు ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది అంటూ ఫోన్ పే స్పష్టం చేసింది. మొత్తానికైతే ఇలాంటి పాలసీల వల్ల కాస్త ఊరట కలుగుతుందని చెప్పవచ్చు.