Vastu Tips: ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.. డబ్బు అయస్కాంతంలా ఆకర్షిస్తుంది..

Sat, 02 Mar 2024-12:13 pm,

వాస్తుశాస్త్రంలో ఇంటి వస్తువులపై కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. ఇంట్లోని దిశ, వస్తువులు మాత్రమే కాదు ఇంట్లో పెంచుకునే మొక్కలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.   

మన అందరి ఇళ్లలో మొక్కలు ఉండటం సహజం. కొన్ని వాస్తు ప్రకారం మంచివైతే మరికొన్ని పూలనిచ్చే మొక్కలను పెంచుకుంటాం. అయితే, ఈరోజు మనం వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆ ఇంట కనకవర్షం కురుస్తుందట. ఆ మొక్క ఏంటో తెలుసుకుందాం.  

హిందూ సంప్రదాయాల ప్రకారం అందరి ఇళ్లలో తులసి, మనీప్లాంట్, కలబంద మొక్కలు ఉండటం సర్వసాధారణం. అయితే, జేడ్ మొక్కను పెంచుకోవడం కూడా శుభప్రదం. దీన్ని క్రాసులా అని కూడా పిలుస్తారు. ఇది ఇండోర్ ప్లాంట్. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మొక్కకు ఎక్కువ నిర్వహణ కూడా అవసరం ఉండదు. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే డబ్బు అయస్కాంతంలా ఆకర్షిస్తుందట.    

ఈ మొక్క బెస్ట్‌ ఇండోర్ ప్లాంట్ చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా వాస్తు ప్రకారం ఇంట్లో పాజిటివిటీకి కృషి చేస్తుంది. ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఇంటి అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది.   

జేడ్ మొక్కను ముఖ్యంగా ఇంటికి తూర్పు దిశ లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాని పొరపాటున కూడా ఈ మొక్కను దక్షిణదిశలో పెంచుకోకూడదు. ఈ మొక్క ఇంట్లో ఉంటే సుఖఃశాంతులను తీసుకువస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి ఆ ఇంట్లో ఉన్నవారు బయటపడతారు.  

వాస్తు ప్రకారం ఇంటి ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే ప్రవేశ ద్వారం కుడివైపున ఈ మొక్కను పెట్టండి. ఇంట్లోకి ప్రవేశించే వారి ప్రతికూల శక్తిని కూడా నివారిస్తుంది. ఈ రకమైన వాస్తు మొక్కలను ఆఫీసుక స్డడీ టేబుల్, స్డడీ టేబుల్ పై కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆఫీసుల్లో అయితే, నైరుతిదిశలో పెట్టుకోవడం మంచిది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link