PM Diwali Gift: కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక.. రూ.20 లక్షలు పొందే బంపర్ ఛాన్స్..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ఈ బంపర్ స్కీమ్ ద్వారా మీరు కూడా భారీ ప్రయోజనం పొందవచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ముద్ర యోజన ద్వారా రూ.20 లక్షలు పొందవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గతంలో రూ.10 లక్షలు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూ.20 లక్షలకు పెంచింది. అంటే డబుల్ పొందవచ్చు. చిన్న సంస్థలను ప్రోత్సహించడానికి, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి ఈ పరిమితిని పెంచింది.

ముద్ర లోన్ ద్వారా చిన్న పరిశ్రమల అభివృద్ధికి, కొత్త అవకాశాలను సృష్టించడానికి ఈ పరిమితిని పెంచింది.దీంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. కొత్తగా ఉద్యోగాలను కూడా సృష్టించవచ్చు.
కొత్తగా ప్రారంభించనున్న వ్యాపారస్తులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ముద్రా లోన్ ద్వారా కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. మీ దగ్గర లోని బ్యాంకులకు వెళ్లి ఈ స్కీమ్ వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ పథకంలో వడ్డీరేటు కూడా అతితక్కువ ఉంటుంది. దీని ప్రక్రియ కూడా ఎంత వేగవంతం, చాలా సులభం. ఎందుకంటే ఇందులో ఎలాంటి గ్యారంటీ కూడా అవసరం లేదు.మీ పథకం ద్వారా మీ కలలను సాకారం చేసుకోవచ్చు. వ్యాపారాభివృద్ధికి కూడా ఈ లోన్ పొందవచ్చు.