Pm Kisan: పీఎం కిసాన్ 19వ విడుత నిధుల విడుదలపై బిగ్ అప్డేట్.. ఆరోజే ఖాతాలో జమా..!
పీఎం కిసాన్ ఇప్పటివరకు పద్ధతి విడతలు రైతుల ఖాతాలో డీబీటీ ద్వారా డబ్బులను జమ చేశారు. ఈ ఏడాదికి మూడు విడతల్లో రూ. 2000 అందజేస్తారు. ఇలా మొత్తంగా రూ.6000 దేశవ్యాప్తంగా ఉన్న రైతుల పెట్టుబడులకు సాయం అందుతుంది.
అయితే అక్టోబర్ 5వ తేదీన 18వ విడుత పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రైతులు 19వ విడుత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు దీనిపై ఒక క్లారిటీ వచ్చింది.
పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు ఫిబ్రవరి మొదటి వారంలో క్రెడిట్ అవుతాయని తెలుస్తుంది. ఎందుకంటే 18వ విడత నిధులు కూడా అక్టోబర్ 5న మొదటి వారంలోనే విడుదల చేసింది.. ఈ నేపథ్యంలో 19వ విడుత నిధులు కూడా మొదటి వారంలోనే వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఇటీవలే ఈ పీఎం కిసాన్ యోజన డబ్బులు రూ. 6000 నుంచి రూ. 10000 కు పెంచే నిర్ణయం తీసుకుంటుందని దీనిపై మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలోనే అప్డేట్ వస్తుందని అందరూ ఎదురు చూశారు. కానీ, క్యాబినెట్ మీటింగ్ లో ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
అయితే, ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ మీటింగ్ లో పీఎం కిసాన్ రూ.10,000 కు పెంపుపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ ప్రకటిస్తే అప్పుడు రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.10,000 జమా చేస్తుంది.