PM Kisan Samman Nidhi: రైతులకు శుభవార్త, పీఎం కిసాన్ స్కీమ్ రూ.2000 త్వరలో ఖాతాల్లోకి

Thu, 06 May 2021-9:44 am,

PM Kisan Scheme Status | అన్నదాతలకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి(PM Kisan Samman Nidhi). కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని డిసెంబర్ 1, 2018న ప్రారంభించింది. రైతులకు ప్రతి ఏడాది మూడు దఫాలుగా ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ఉద్దేశం. 

Also Read: PM Kisan Mandhan Yojana: రైతులకు గుడ్ న్యూస్, ఆ పథకంలో చేరితే ఖాతాల్లోకి రూ.36,000

పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం(PM Kisan Scheme)లో భాగంగా మూడు దఫాలుగా రైతుల బ్యాంకు ఖాతాలలో రూ.2000 చొప్పున మొత్తం 6వేల నగదు జమ చేస్తారు. మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు రైతుల ఖాతాలకు రూ.2 వేలు జమ చేస్తారు. ప్రస్తుతం రైతులు 8వ విడత రూ.2000 నగదు కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై వారికి శుభవార్త అందింది.

Also Read: PM Kisan Samman Nidhi నిబంధనల్లో భారీ మార్పులు, ఇకపై వారికి రూ.6 వేలు జమ కావు

2021లో తొలి విడత నగదు ( ఓవరాల్‌గా 8వ విడత చెల్లింపులు) మే 10వ తేదీన రైతుల ఖాతాల జమ కానుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు విడుదల చేయనుందని తెలుస్తోంది. ఈ ఏడాది పీఎం కిసాన్ పథకంలో భాగంగా అమలు చేస్తున్న కొత్త రూల్స్ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు రూ.2000 అందుతుంది. నేరుగా రైతుల ఖాతాలలో నగదు జమ అవుతుంది.

పీఎం కిసాన్ పథకంలో భాగంగా 8వ దఫాలో మొత్తం 11.7 కోట్ల మంది రైతులు లబ్దిదారులుగా ఉన్నారు. ఈ ఏడాది తొలి దఫా చెల్లింపులు చేసేందుకు కేంద్ర వ్యవసాయశాఖ కసరత్తు పూర్తి చేసింది. మే 10 నుంచి లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read: PM kisan samman nidhi: మీ ఖాతాలో డబ్బులు చేరలేదా..ఇలా చేయండి చాలు

రైతుల బ్యాంకు ఖాతాలోకి 8వ విడత పీఎం కిసాన్ నిధి జమ వివరాలు రైతులు ఇలా తెలుసుకోవచ్చు.  రైతులు http://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి చెక్ చేసుకోవాలి.   పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో Farmer Cornerకు వెళ్లాలి.   ఆ తర్వాత Beneficiary Status మీద క్లిక్ చేయాలి. తమ అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే లబ్ధిదారుల ఖాతా వివరాలు కనిపిస్తాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link