PM Kisan Yojana: రైతులకు దీపావళికి ముందే కేంద్రం భారీ గిఫ్ట్.. ఖాతాల్లో రూ.2000 జమా! వెంటనే ఇలా చెక్ చేసుకోవచ్చు..
వ్యవసాయం మన దేశంలో ప్రధాన ఆధారం. ఈ సెక్టార్ మనదేశంలో ప్రథమ స్థానంలో ఉంది. అయితే, ప్రతిరోజూ రైతులు ఇప్పటికీ ఆర్థిక ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో కేంద్రం వారికి బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి చర్యలు తీసుకుంది.
దీని వల్ల ఎన్నో కోట్ల మంది వ్యవసాయదారులు లబ్ది పొందుతున్నారు. ఆ పథకమే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద ఏడాదికి రూ.6000 రైతుల పొందుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజనను 2019లో ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడం. రైతుల ఖాతాల్లో నేరుగా జమా చేస్తుంది. ఏడాదికి మూడు దఫాల్లో డీబీటీ ద్వారా ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌కు రూ. 2000 జమా చేస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పీఎం కిసాన్ 17వ ఇన్‌స్టాల్‌మెంట్ ద్వారా ఇప్పటి వరకు కొన్ని కోట్లమంది రైతులు లబ్ది పొందారు.అయితే, 18వ ఇన్‌స్టాల్‌మెంట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
18వ ఇన్‌స్టాల్‌మెంట్ ఖాతాల్లో ఎప్పుడు జమా అవుతాయా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే, ఓ విశ్వనీయమైన రిపోర్టు ప్రకారం అక్టోబర్ దీపావళి పండుగ ముందే జమా అవుతాయని సమాచారం. అయితే, దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఈలోగా రైతులు తమ ఖాతాలకు సంబంధించి ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. 18వ విడత కిసాన్ యోజన డబ్బులు ఏ ఆటంకం లేకుండా మీ ఖాతాల్లో జమా అవ్వాలంటే వెంటనే ఇకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి.
ఇకేవైసీ.. ఇకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు ఎక్కడకు వెళ్లాల్సిన అవసరంలేదు. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా నేరుగా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ స్టేటస్.. పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి https://pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ నమోదు చేయాలి. మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ ఓటీపీ వస్తుంది. ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.