PM Kisan Yojana: రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే..
ఎన్‌డీఏ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని 2018లో ప్రారంభించింది. చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6000 రైతుల ఖాతాల్లో జమా చేస్తారు. ఈ డబ్బును మూడు విడతలుగా చెల్లిస్తుంది. ఈ సారి 18వ విడుత రేపు అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనుంది.
ఈ డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా జమా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. 17వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జూన్ నెలలోనే జమా చేసిన సంగతి తెలిసిందే. ఈ విడుతలో 9.3 కోట్ల రైతులకు రూ.20 వేల కోట్లను జమా చేసింది. అయితే, దసరా పండుగ ముందు మరో విడుతను ప్రారంభించనుంది.
అయితే, ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు కూడా అర్హులు అయితే మీ పేరు నమోదు చేసుకుని కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో 'ఫార్మర్ కార్నర్' ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఇకేవైసీ పై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. మీ రిజిస్టర్ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని అక్కడ ఎంటర్ చేయాలి.
పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో క్రెడిట్ కాకపోతే కేంద్రం కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్ 1800115526 కాల్ చేయవచ్చు. అంతేకాదు మీ సమస్యను ఈ మెయిల్ ఐడీ ద్వారా కూడా నమోదు చేయవచ్చు. ID pmkisan-ict@gov.in మెయిల్ చేయాలి. అంతేకాదు 011-2381092 నంబర్ ద్వారా కూడా పీఎం కిసాన్ ఖాతాకు సంబంధించిన వివరాలు పొందవచ్చు.
పీఎం కిసాన్‌కు దరఖాస్తు చేసుకునే విధానం.. ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in ఓపెన్ చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే, దీనికి మీ వద్ద మూడు కాపీలు ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, మీ భూమి రికార్డు.
ఇక పీఎం కిసాన్ యోజనలో మీ ఖాతాకు సంబంధించిన స్టేటస్‌ను కూడా చెక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. మీ దగ్గర ఉన్న ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. లబ్దిదారుల స్టేటస్ చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి బెనిఫిషియరీ స్టేటస్‌లో ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత 'Get Data' క్లిక్ చేయాలి.