PM Kisan Yojana : రైతులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మీ అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు

Mon, 26 Aug 2024-8:34 pm,

PM Kisan 18th Installment Date 2024: రైతు  దేశానికి వెన్నుముక. రైతు సంక్షేమమే దేశం సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు అండగా నిల్చేందుకు సరికొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ప్రధానమైంది పీఎం కిసాన్ యోజన. 

2019వ ఏడాదిలో కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది. నేటి వరకు ఎంతో విజయవంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది.  జూన్ 18వ తేదీ 2024న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 17వ విడత నిధులను ఈ మధ్యే రైతుల అకౌంట్లోకి జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో రైతు అకౌంట్లో రూ. 2000చొప్పున జమ చేసింది. ఇప్పుడు 18వ విడత కిసాన్ సమ్మాన్ నిధుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 

పీఎం కిసాన్...ఈ పథకం పూర్తి పేరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద కేంద్రం ప్రతి ఏటా రైతులకు మూడు విడతల్లో రూ. 6,000ఇస్తోంది. ఈ డబ్బుతో రైతులు విత్తనాలు, పరుగుల మందులూ కొనుగోలు చేస్తున్నారు. ఇలా ప్రతీ నాలుగు నెలలకు ఓసారి ఈ నిధులు విడుదల అవుతాయి.  

చిన్న, సన్నకారు రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం  కింద ఏటా రూ. 6,000పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతులకు ఇతర పేర్లతో నిధులు విడుదల చేస్తున్నాయి. 2024లో ఈ పథకం నిధులు ఎప్పుడు విడుదలయ్యే పరిశీలించినట్లయితే..16వ విడత ఫిబ్రవరి, 17వ విడత జూన్ 18న విడుదలయ్యాయి. 

వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2024 కోసం  పీఎం కిసాన్ 18వ విడతను  త్వరలోనే ప్రకటించనుంది .నిర్దిష్ట విడుదల తేదీని ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు. 18వ విడత నవంబర్ లేదా డిసెంబర్ 2024లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. లబ్ధిదారులు ఇప్పటికే జూన్ 18, 2024న  17వ విడతను అందుకున్నారు.  

ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?: PM కిసాన్ 18వ విడత లబ్ధిదారుల స్టేటన్ చెక్ చేయడానికి  దరఖాస్తుదారులు https://pmkisan.gov.in/ వద్ద అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఆ తర్వాత హోమ్‌పేజీలో, వారు తప్పనిసరిగా "మీ స్టేటస్ ను  తెలుసుకోండి" ఎంపికపై క్లిక్ చేయాలి.  తమ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాల్సిన చోట కొత్త పేజీ కనిపిస్తుంది.వివరాలను పూరించిన తర్వాత, వారు సమాచారాన్ని ధృవీకరించాలి. ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు  OTP వస్తుంది. చివరగా, వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేయాలి.  ప్రక్రియను పూర్తి చేయడానికి “సమర్పించు” క్లిక్ చేయాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link