PM Modi Assets: వారణాసిలో హ్యట్రిక్ పై గురి.. ప్రధాని మోదీ ఆస్తులు వివరాలు మీకు తెలుసా..?

Tue, 14 May 2024-8:24 pm,

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మూడోసారి లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేశారు. అంతంకు ముందు పవిత్రమైన కాశీలో దశ అశ్వమేథ ఘాట్‌ వద్ద ప్రత్యేకంగా  పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రాల మధ్య గంగమ్మకు  మొక్కలు తీర్చుకున్నారు. 

గంగామాత పూజల అనంతరం స్థానికంగా ఉన్న  కాల భైరవ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడున్న ప్రజలకు అభివాదం చేస్తు.. ర్యాలీగా నామినేషన్‌ వేసేందుకు వారణాసి కలెక్టరేట్‌ కార్యలయానికి వెళ్లారు. బనారస్‌ హిందూ యూనివర్శిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం  భారీగా రోడ్ షో నిర్వహించారు.   

ప్రధాని మోదీ మూడు సారి నామినేషన్ కు దేశంలోని బీజేపీతో ఉన్న మిత్రపక్షాల  నేతలు హజరయ్యారు. అనేక మంది అతిరథ మహారథులు హజరయ్యారు.క్యాబినెట్ మంత్రులు, అనేక బీజేపీ పాలిత సీఎంలు, ముఖ్యనేతలు ఆయనకు మద్దతుగా హజరయ్యారు.   

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్,బిహార్ సీఎం నితీశ్‌ కుమార్, ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, అసోం సీఎం హిమంత్‌ బిశ్వ శర్మ, హరియాణా సీఎం నయాబ్‌ సింగ్ సైనీలతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌లతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలొ పాల్గొన్నారు. 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ ఒక రోజు ముందుగానే వారణాసికి చేరుకున్నారు. వారణాసితో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇక్కడ పవిత్రమైన దేవభూమి, గంగానదిలో ఆధ్యాత్మిక భావం కల్గుతుందని మోదీ అన్నారు.   

ఇక మాజీ సీఎం చంద్రబాబు మాట్లాడుతు.. ప్రధాని మోదీనాయకత్వం మన దేశానికి అవరసమని అన్నారు. మోదీ మూడోసారి హ్యాట్రిక్ పీఎం కావడం ఖాయమన్నారు. ప్రధానిని నామినేషన్ దాఖలు చేసేటప్పుడు.. అయోధ్య రామాలయం పూజారి, ఓ దళితుడు, ఇద్దరు ఓబీసీలు ప్రధాని మోదీ నామినేషన్‌ను ప్రతిపాదించినవారిలో ఉన్నారు.   

ఇక ప్రధాని మోదీ తన ఆస్తులు జాబితాను ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ లో పొందుపర్చారు. తన చేతిలో రూ. 52,920 నగదు ఉన్నట్లు తెలిపారు.ఇక బ్యాంకు ఖాతాలో.. రూ. 80,304, ఎఫ్ డీ ల రూపంలో..రూ.2,85,60,338, ఉన్నట్ల వెల్లడించారు .   

అదే విధంగా నాలుగు బంగారు ఉంగారాలు (రూ. 2.67 లకలు),పలు ఇన్సురెన్స్ పాలసీలు కలిపి రూ. ౩ కోట్ల ఆస్తులున్నట్లు ఆయన అఫిడవిట్ లో పొందు పర్చారు. కాగా, ఆయన సతీమణి ఆస్తులను మాత్రం ఈ అఫిడవిట్ లో పేర్కొనలేదు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link