PM Modi: మన దేశ ప్రధాని మోడీకి రక్షణ కల్పించే SPG కమాండోలకు నెల జీతం ఎంతో తెలుసా.. !

Wed, 18 Sep 2024-6:05 am,

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అనేది భారత ప్రధాన మంత్రిని కంటికి రెప్పలా కాపాడే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ. 1988లో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైన SPG ప్రధానమంత్రికి భద్రతను పర్యవేక్షిస్తూ వస్తోంది.

SPG కమాండోలు అప్ గ్రేడెడ్ ఆయుధాలను కలిగి ఉంటారు. మరియు ప్రధాని రక్షణ కోసం 3 లెవల్లో వలయంలా ఉంటారు. వీళ్లు ఎల్లపుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరిస్తూ ప్రధాని రక్షణ బాధ్యతలను నిర్వహిస్తారు.

 

ప్రధాన మంత్రి వెంట వెళ్లేటప్పుడు ముదురు సన్ గ్లాసెస్ ధరించి ఉంటారు. అంతేకాదు ప్రత్యర్ధులు వీళ్ల ముఖంలో ఎలాంటి ముఖ కవళికలను కనుగొనకుండా గంభీరంగా ఉండటంలో శిక్షణ ఇస్తారు.

SPG ఉపయోగించే ఆయుధాలలో FN P90 మెషిన్ గన్స్, FN హెర్స్టాల్ F2000 రైఫిల్స్ మరియు గ్లాక్ 17 ఆటోమేటిక్ పిస్టల్స్ ఉంటాయి. SPG కమాండో కావడానికి, మీరు తప్పనిసరిగా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

IPS, CRPF, CISF లేదా ITBP వంటి బలగాల్లో చేరిన తర్వాత అందులో సుశిక్షితులైన వారిని SPGలో అవకాశం కల్పిస్తారు. అందులో అన్ని రకాలుగా ట్రైయిన్ అయిన తర్వాత ప్రధాన మంత్రి భద్రతా విభాగంలో తీసుకుంటారు.

భారతదేశంలో, SPG కమాండో యొక్క నెలవారీ జీతం రూ. 84,236 నుండి రూ. 2,39,457 వరకు ఉంటుంది. ఒక SPG భద్రతా అధికారి సంవత్సరానికి రూ. 13.2 లక్షల వరకు జీతం ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link