Rapid Rail Pics: అత్యంత ఆకర్షణీయంగా ర్యాపిడ్ రైళ్లు, విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి
ర్యాపిడ్ రైలు వ్యవస్థలో మెట్రో తరహాలోనే ప్రత్యేక రైలు మార్గం ఉంటుంది. చూడ్డానికి మెట్రో రైళ్లలానే ఉన్నా..సీటింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. భద్రత కోసం సీసీ కెమేరాల పర్యవేక్షణ ఉంటుంది.
ఈ తరహా ర్యాపిడ్ రైలు క్యారిడార్లను మరో 8 నిర్మించనున్నారు. మొదటి దశలో ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిదిలో ఘజియాబాద్-మీరట్, ఢిల్లీ-గుర్గావ్-నిమ్రానా-అల్వార్, డిల్లీ-పానిపట్ ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న రైళ్లు ఢిల్లీ-మీరట్ మధ్య 82 కిలోమీటర్ల దూరానికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం తీసుకుంటున్నాయి. ర్యాపిడ్ రైలు ద్వారా కేవలం గంటలో ఢిల్లీ నుంచి మీరట్ చేరుకోవచ్చు.
ఢిల్లీ మీరట్ మొత్తం మార్గం పూర్తయితే ప్రయాణ సమయం గణనీయం తగ్గిపోనుంది. గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో, సరాసరిన 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ప్రధాని ప్రయాణ సమయంలో మరో మూడు ర్యాపిడ్ రైళ్లు ఆయనతో కలిసి ప్రయాణిస్తారు. మొదటిది పైలట్ రైలు కాగా రెండవది ప్రయాణీకులది, మూడవది ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగీ ప్రయాణించే రైలు.
రేపు అక్టోబర్ 20న లాంఛనంగా ప్రధాని మోదీ స్వయంగా తొలి టికెట్ కొనుగోలు చేసి ఇందులో ప్రయాణిస్తారు. యూపీఐ ద్వారా ప్రధాని మోదీ తొలి టికెట్ కొనుగోలు చేస్తారు
ఢిల్లీృ-మీరట్ మధ్య దూరం 82 కిలోమీటర్లు కాగా తొలిదశలో భాగంగా 17 కిలోమీటర్ల షాహిదాబాద్ నుంచి దుహై మార్గం పూర్తయింది. ఈ మార్గంలో ప్రయాణించడం ద్వారా ప్రధాని మోదీ ర్యాపిడ్ రైలు ప్రారంభిస్తారు.
దేశంలోనే అత్యధిక వేగంతో ప్రయాణించే ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టుకు 2019 మార్చ్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ-మీరట్ మధ్య తొలి ర్యాపిడ్ రైలు ప్రారంభం కానుంది.