PM Modi Patna Visit: గురుద్వారాలో ప్రధాని మోదీ.. తన చేత్తో భక్తులకు లంగర్ కార్యక్రమం..
దేశంలో ప్రస్తుతం పలు చోట్ల ఈరోజు నాలుగో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగుస్టేట్స్ లో ఎన్నికలు కాస్తంతా హాట్ టాపిక్ గా నే నిలుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీహార్ లోని పట్నాకు వెళ్లారు.
ఈ నేపథ్యంలో ఆయన పట్నాలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ పట్నా సాహిబ్ ను దర్శించుకున్నారు. ఈ ఆలయంను సిక్కులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. గురుద్వారాలో ప్రధాని మోదీ.. నారింజరంగు తలపాగ వేసుకున్నారు.
బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ తో కలిసి మోదీ హరిమందిర్ ఆలయంను సందర్శించారు. అక్కడ భక్తుల కోసం తయారు చేస్తున్న పదార్థాలను చూశారు. అక్కడి ప్రసాదాల తయారీ ప్రదేశం దగ్గరకు వెళ్లి గరిట పట్టుకున్నారు.
సిక్కులకు ప్రసాదంగా చెప్పే లంగర్ అనే విధానంలో అందరికి వడ్డించే కార్యక్రమం చేశారు. భక్తులందరికి స్వయంలో తన చేత్తో వడ్డించారు. అక్కడి పిల్లలతో ఉల్లాసంగా గడిపారు.
తఖత్ శ్రీ పాట్నా సాహిబ్, తఖత్ శ్రీ హరిమందిర్ జీ, పాట్నా సాహిబ్ అని కూడా పిలుస్తారు, ఇది రాష్ట్ర రాజధానిలో ఉన్న సిక్కుల ఐదు తఖత్‌లలో ఒకటి. గురుగోవింద్ సింగ్ జన్మస్థలం గుర్తుగా 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ చేత తఖత్ నిర్మాణం చేపట్టబడింది.
గురు గోవింద్ సింగ్, పదవ సిక్కు గురువు. 1666లో పాట్నాలో జన్మించారు. ఆనంద్‌పూర్ సాహిబ్‌కు వెళ్లడానికి ముందు అతను తన ప్రారంభ సంవత్సరాలను కూడా ఇక్కడే గడిపాడని చెబుతుంటారు.
ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఈరోజు బీహార్ లో పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. హజీపూర్, ముఫర్ పుర్, సరణ్ జిల్లాలలో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు.
బీహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఎన్డీయేలో భాగంగా బీజేపీ 17, జేడీ(యూ) 16 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.కాగా, మహాఘటబంధన్ (మహాకూటమి)లో విపక్షాల కూటమి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) 40 లోక్‌సభ స్థానాల్లో 26 స్థానాల్లో పోటీ చేయనుండగా, కాంగ్రెస్ 9 స్థానాల్లో, వామపక్షాలు మిగిలిన ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. .