Poco F7 Pro: ఫీచర్స్ అంటే ఇవి సామీ.. Poco నుంచి అద్భుతమైన మొబైల్స్.. చూడడానికి రెండు కళ్లు చాలవు!

ప్రముఖ Poco కంపెనీ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను పరిచయం చేసింది. ఇది Poco F7 అల్ట్రాతో పాటు Poco F7 ప్రో పేర్లతో విడుదల కాబోతున్నాయి. అయితే లాంచింగ్‌కి ముందే ఈ కార్లుకు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఈ రెండు వేరియంట్స్‌లో Poco F7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుంగా ఇది 6.67-అంగుళాల Oled స్క్రీన్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ డిస్ల్పే 2k రిజల్యూషన్ (1440 X 3200 పిక్సెల్‌లు)ను కలిగి ఉండబోతోంది.

ఇక ఈ Poco F7 అల్ట్రా మొబైల్ 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా ఈ మొబైల్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక దీని కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది Oisతో కూడిన 50 Mp ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది.
Poco F7 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 50 Mp టెలిఫోటో లెన్స్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా శక్తివంతమైన 6,000mah బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో కంపెనీ 40 నిమిషాల్లో పూర్తి ఛార్జ్ చేసే 120 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే 50 W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
ఇక Poco F7 ప్రో స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే.. ఇది అచ్చం చూడడానికి Redmi K80 ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ 6,000mah బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో విడుదలైంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ధరను త్వరలోనే వెల్లడించనుంది.