Poha Nutrition: బ్రేక్ ఫాస్ట్‌లోకి పోహాను తింటున్నారా.. అయితే మీకు ఈ విషయం తెలుసా??
పోహా తినడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తాయి.
గోధుమతో తయారు చేసిన ఆహారపదార్థాలకు అలెర్జీ ఉన్నవారు పోహాను తివచ్చు. ఇందులో గ్లూటెన్ వుండదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలి అనుకొనేవారికి పోహా ఒక అద్భుతమైన ఆహారం. ఇది ఆకలిని నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది.
జీర్ణసమస్యలతో బాధపడేవారు ఈ పోహాను బ్రేక్ ఫాస్ట్‌లో తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నంచి ఉపశమనం పొందవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పోహాను తినవచ్చు. ఇందులో విటమిన్ బి-1 అధికంగా ఉంటుంది. షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.
పోహాలో వేరుశెనగలను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా దొరుకుతాయి.
పోహాలో ప్రోబయోటిక్ ఆహారం. అంతేకాకుండా ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినవచ్చు.
గమనిక: ఇక్కడ చెప్పిన సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం ఆరోగ్యనిపుణులను సంప్రదించాలి.