Pooja Hegde: అతిలోకసుందరిలా పూజాహెగ్డే.. వైట్ డ్రెస్ లో మెరిసిపోయిన బుట్ట బొమ్మ

Wed, 10 Jan 2024-8:08 pm,

Pooja Hegde Pics: 

నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమాతో మన అందరిని పలకరించిన బుట్ట బొమ్మ పూజా హెగ్డే. ఆ తరువాత వరుణ్ తేజ్ తో ముకుందా సినిమాలో కనిపించి మరింత మెప్పించింది.

తెలుగులో వరసగా ఆఫర్లు అందుకున్న పూజ హెగ్డే దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించి అలరించింది. అలా వైకుంఠపురం లో లాంటి ఇండస్ట్రీ హిట్ కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

కానీ గత కొద్ది రోజుల నుంచి పూజా హెగ్డే కి వరుస ఫ్లాపులు రావడంతో అభిమానులు కొంచెం నిరాశకు గురవుతున్నారు. ఆచార్య, రాదే శ్యామ్, బీస్ట్ లాంటి వరస డిజాస్టర్లు హోమము అందుకుంది ఈ హీరోయిన్.

కానీ ప్రస్తుతం మాత్రం తన అభిమానులను ఖుషీ చేయడానికి ఇంస్టాగ్రామ్ లో అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంది.

ముఖ్యంగా వైట్ లెహంగాలో పూజా హెగ్డే షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బుట్ట బొమ్మ చూడడానికి ఈ వైట్ డ్రెస్ లో అచ్చం అతిలోక సుందరిలా ఉంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం పెద్దగా ఆఫర్లు లేని పూజా హెగ్డే త్వరలోనే తెలుగులో మంచి ఛాన్సులు దక్కించుకొని తిరిగి సూపర్ హిట్లు అందుకుంటుందేమో వేచి చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link