Pooja Hegde: సూర్యాస్తమయం వేళ బీచ్ లో ఫోజులు కొడుతున్న బుట్ట బొమ్మ.. !
అలా వైకుంటపురంలో సినిమాతో బుట్ట బొమ్మగా పేరు సొంతం చేసుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేక్షకులకు సుపరిచితురాలుగా మారిన ఈమె ముంబైలో పుట్టి పెరిగినా, తన అందచందాలతో తెలుగువారిని బాగా ఆకట్టుకుంది. లేత అందాలతో మైమరిపించే సోయగాలతో ఎప్పటికప్పుడు యువతకు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది.
ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత ముకుంద సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు షేర్ చేసే ఈమె.. మరొకసారి బీచ్ లో హొయలు పోతూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫోటోలు పంచుకుంది.
పూజా హెగ్డే తాజాగా బీచ్ లో విహరిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యాస్తమయం వేళ.. హాఫ్ షోల్డర్, బాటమ్ థైస్ కనిపించేలా బ్లాక్ అండ్ వైట్ చెక్స్ కలిగిన వన్ పీస్ డ్రెస్ ధరించి హాట్ ఫోజులతో సూర్యుడికే చెమటలు పట్టించేలా చేసింది .ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ అందాలు చూసి అందరూ ఫిదా అవుతున్నారు. బీచ్ లో వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరుకు మోహితులవుతున్నారు.
ఏది ఏమైనా పూజా హెగ్డే షేర్ చేసిన ఈ బీచ్ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన ఇంస్టా ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఇట్టే వైరల్ గా మారడం గమనార్హం.ఇకపోతే పూజా హెగ్డే సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె అలవైకుంటపురంలో సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఆ తర్వాత అదే కాంబినేషన్లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాలో కూడా మరొకసారి నటించి ఆకట్టుకుంది. ఇక తర్వాత నటించిన కొన్ని సినిమాలు పూజా హెగ్డే కు మంచి విజయాన్ని అందించలేదు. ఇంకొన్ని సినిమాలలో అవకాశం వచ్చినా కొన్ని కారణాలవల్ల తప్పించడం జరిగింది.ఇక తమిళ్లో కూడా బీస్ట్ వంటి చిత్రాలలో నటించింది కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది.