Pooja Hegde: గోల్డ్ డ్రెస్సులో పూజా హెగ్డే.. హీట్ పెంచేసే అందాలు
మాస్క్ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన పూజా హెగ్డే ఆ తరువాత నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
మొదటి సినిమాతో ఒక మోస్టారు విజయం సాధించిన ఈ హీరోయిన్ ఆ తరువాత వరుణ్ తేజ్ సినిమాలో కనిపించింది. ఇక అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం చిత్రంలో సైతం ఆఫర్ అందుకుంది.
అవకాశాలు వరుసగా వస్తున్న సమయంలో రంగస్థలంలో ఐటమ్ సాంగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన అరవింద సమేత సినిమాతో తన ఫస్ట్ సూపర్ హిట్ సినిమా అందుకుంది ఈ హీరోయిన్.
ఇక అప్పటినుంచి ఈ హీరోయిన్ కి సినిమా ఆఫర్లకు సమస్య లేకుండా పోయింది. ఎన్నో సినిమా ఆఫర్లు అందుకుంటూ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా దూసుకుపోయింది.
అయితే ఈ మధ్య వచ్చిన పూజా సినిమాలు అన్నీ డిజాస్టర్ చవిచూడడంతో ప్రస్తుతం ఒక మంచి విషయం కోసం ఎదురుచూస్తోంది ఈ హీరోయిన్.
ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా అభిమానులను అలరిస్తోంది. ఈ మధ్యనే గోల్డ్ డ్రెస్ లో పూజ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఫిదా చేస్తున్నాయి.