Pooja Hegde: రెడ్ డ్రెస్ లో పూజహెగ్డే హాట్ హాట్ స్టిల్స్.. ఫిదా అయిపోయిన అభిమానులు..

Fri, 02 Feb 2024-11:01 pm,

Pooja in Red: నాగచైతన్య హీరోగా వచ్చిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ పూజా హెగ్డే. ఆ తరువాత ముకుంద సినిమాతో మరింత చేరువయ్యింది.

అక్కడి నుంచి వరుసగా ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ కి ఎదిగింది. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరూ హీరోలతోనే చేసింది ఈ హీరోయిన్.

ఈ హీరోయిన్ కెరియర్ లో అలా వైకుంఠపురం లాంటి ఇండస్ట్రీ హిట్ కూడా అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో అరవింద క్యారెక్టర్ లో కనిపించి అందరినీ తన నటనతో మెస్మరైజ్ చేసింది.

అయితే ప్రస్తుతం మాత్రం పూజా హెగ్డే కి తెలుగులో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాల ఆఫర్లను పోగొట్టుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాని సైతం వదులుకుందని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ రెడ్ డ్రెస్ లో కారు ముందు నిలబడుకొని ఫోజులు ఇచ్చిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఆమె అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫోటోలలో ఈ హీరోయిన్ ఎంతో అందంగా కనిపిస్తూ మరోసారి ఆమె వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుంది అని అభిమానుల్లో రేకెత్తిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link