Pooja Hegde: దీపావళికి ఈ పూజ హెగ్డే చీరను ట్రై చేయండి..మీరు బంగారంలా మెరిసిపోవడం ఖాయం..!
ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పూజా హెగ్డే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందచందాలతో యువతని ఎప్పుడు ఆకట్టుకుంటూ ఉంటుంది.
ముఖ్యంగా అలా వైకుంఠపురం , దువ్వాడ జగన్నాథం వంటి చిత్రాలలో అల్లు అర్జున్ సరసన నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె అతి తక్కువ సమయంలోనే తెలుగు స్టార్ హీరోలు అందరి సరసన నటించినది.
ఈ మధ్యకాలంలో వరుస డిజాస్టర్లు ఎదురవడంతో బాలీవుడ్ కి మకాం మార్చిన పూజా హెగ్డే.. ఇప్పుడు మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామరస్ ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె తాజాగా మరో లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసింది. గోల్డెన్ కలర్ సారీలో.. ఎంబ్రాయిడరీ వర్క్ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి గోల్డెన్ కలర్ మేని ఛాయతో మరొకసారి అందరిని మెస్మరైజ్ చేసింది.
కాటుక కళ్ళతో గిలిగింతలు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అంద చెందాలతో మరొకసారి ఆకట్టుకుంది. అంతేకాదు దీపావళి సంబరాలు మొదలైపోయాయి అనే క్యాప్షన్ కూడా పెట్టండి. ఇక ఈ చీర మీరు దివాళికి ట్రై చేస్తే మీరు కూడా ఆమెలా మరిచిపోవడం ఖాయం. ఇక ప్రస్తుతం కోలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలలో అవకాశాలు అందుకుంటున్న ఈమె అందులో భాగంగానే ఇలా వరుస ఫోటోషూట్లతో అభిమానులకు మరింత దగ్గరవుతోంది.