Pooja Hegde: వరుస ఫ్లాపులతో డీలా పడ్డ పూజా హెగ్డే.. అందుకే వరుసగా హాట్ ఫోటో షూట్స్..

Thu, 06 Jun 2024-3:21 pm,

పూజా హెగ్డే విషయానికొస్తే.. కన్నడ భామ అయిన తమిళ మూవీ 'మూంగముడి'తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది.  ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన 'ఓ లైలా కోసం'మూవీతో ఇంట్రడ్యూస్ అయింది. ఇక వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన 'ముకుందా' సినిమాలో గోపికమ్మగా మంచి నటనే కనబరిచింది.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో  అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా పూజా హెగ్డే ఫేట్ మారింది.

అటు హిందీలో చేసిన 'సర్కస్’, సల్మాన్ ఖాన్‌తో చేసిన 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీల ఫ్లాపులతో అక్కడ స్టార్ డమ్ తగ్గింది.

చివరగా మహేష్, త్రివిక్రమ్ సినిమాలో ముందుగా పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఎందుకనే ఆమెను తప్పించి.. అదే సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకున్నారు.

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో సరైన సినిమాలు లేవనే చెప్పాలి. ఇటీవలె వరుస ఫ్లాపులతో  అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియాలో తన  హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link