Poori: పూరీలు పొంగడం లేదా..?..ఈ టిప్స్ పాటిస్తే పీచు మిఠాయిల్లా పెద్దగా పొంగుతాయి..
మనలో చాలా మంది పూరీలను ఎంతో ఇష్టంతో తింటారు. అయితే.. పూరీలను చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే పూరీలు క్రిస్పిగా, ఉబ్బెత్తుగా తయారౌతాయి.
మొదట గోధుమ పండిని ఒక గిన్నెలో తీసుకొవాలి. దీనిలో గొరు వెచ్చని నీళ్ళను మిక్స్ చేసుకుని కలుపుకొవాలి. కొద్దిగా పాలను కూడా మిక్స్ చేసుకొవాలి. దీనిలో సొడాను కూడా వేయాలి. ఇలా గోధుమ పిండిని ముద్దలుగా చేసుకుని ఐదు నిమిషాలు అలానే ఉంచేయాలి.
గోధుమ పిండిముద్దలో సొడా, ఉప్పు, కారం కూడా వేయడం వల్ల పూరీలు పీచు మిఠాయిలా పొంగుతాయి. ఆ తర్వాత గోధుమ పిండి ముద్దల్ని.. పూరీ ప్రెస్ బోర్డు మీద పెట్టుకుని కర్రతో రౌండ్ గా చేసుకొవాలి. ఇలా చేసిన తర్వాత గ్యాస్ స్టౌవ్ మీద కడయ్ లో నూనె వేసి సిమ్ మీద ఉంచాలి.
కడయ్ లో నూనె మరిగించే వరకు వేచీ చూడాలి. ఆ తర్వాత పూరీలను మెల్లగా కడయ్ లోకి వదలాలి. ఆతర్వాత పూరీలు కడయ్ లో ఉండే నూనెకు పొంగుతాయి. కొన్ని నిముషాల్లోనే పూరీలు పొంగుతు పైకి వస్తాయి. అప్పుడు జాలీ గంటతో పూరీల్ని మరొ బాక్స్ లోకి వేసుకొవాలి.
ఇలా చేస్తే పూరీలు చక్కగా, పెద్దవిగా, గుండ్రంగా మారతాయి. పూరీలు గుండ్రంగా పెద్దవిగా కూడా కన్పిస్తాయి. చాలా మంది ఈ సింపుల్ ట్రిక్ తెలియక పూరీలు గుండ్రంగా రావడంలేదని తెగ టెన్షన్ పడిపోతుంటారు.
పూరీలు ఆలుకర్రీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పాలక్ పన్నీర్, పూరీల్ని పానకంతో, పాలకూర పప్పుతో తిన్న కూడా ఎంతో టెస్టీగా ఉంటాయి. పూరీల్ని ఇలా ఈజీ స్టెప్స్ ఫాలో అయితే.. సింపుల్ గా చేసుకొవచ్చు.