Actress Kavitha: పిల్లలు వద్దని పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే రెండు నెలల్లోనే గర్భం..!
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. 11 ఏళ్ల వయసులోనే తన నటన , ప్రతిభను కనబరిచి ఎంతో మంచి పేరు సొంతం చేసుకున్న ప్రముఖ సినీనటి కవిత గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం భాషలో 100 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె సినిమాలో సక్సెస్ అయింది కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్యూర్ గానే నిలిచిందని చెప్పవచ్చు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా అవతారం ఎత్తిన తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ , చిరంజీవి వంటి స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అలరించిన కవిత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కరోనా వచ్చిన సమయంలో తన భర్తను, అలాగే కొడుకును ఒకేసారి కోల్పోయిన ఈమె ఇప్పటికీ ఈ విషాదాల నుండి ఇంకా కోలుకోలేదని చెప్పవచ్చు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కవిత తన కుటుంబం గురించి అలాగే కొన్ని సున్నితమైన విషయాల గురించి వెల్లడించి అందరిని కంటతడి పెట్టించింది. కవిత మాట్లాడుతూ.. నేను చాలా చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. తొందరగా పెళ్లి కూడా చేసుకున్నాను. అప్పట్లో నాకు ప్రేమ గురించి ఏమీ తెలియదు. అయితే నాకు కాబోయే భర్త కృష్ణలా ఉండాలని మాత్రం కలలు కన్నాను. కానీ రిషీ కపూర్ తో ప్రేమలో పడ్డాను.
పెళ్లి ఫిక్స్ అయ్యాక వాళ్ళకి ఒక కండిషన్ కూడా పెట్టాను. బిడ్డను త్వరగా ఇవ్వమని అత్తగారు చెబితే అప్పుడు చెప్పాను నాకు పిల్లల పుట్టారు అని, అదే సమయంలో మా ఇంట్లో జరిగిన ఒక విషాదం కూడా గుర్తొచ్చింది.
నాకు తమ్ముడు ఉన్నాడు. అతడు పుట్టిన వెంటనే ఈ లోకాన్ని విడిచి పెట్టాడు. అందుకే నేను పిల్లలు పుట్టకూడదని, చనిపోకూడదని నిర్ణయించుకున్నాను అంటూ తెలిపాను. అయితే ఆ తర్వాత మా అమ్మ, నా భర్త నన్ను ప్రోత్సహించారు. దాని నుండి బయటపడి పెళ్లయిన రెండు నెలలకే గర్భం దాల్చాను అంటూ చెప్పుకొచ్చింది కవిత. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.