Tollywood hero: తండ్రి కాబోతున్న యంగ్ హీరో.. ఇంతకీ ఎవరంటే..!

Thu, 21 Nov 2024-1:31 pm,

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే యూత్లో మంచి ఫాలోయింగ్ అందుకున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉండే సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నారు.   

ఇక ఈయన వ్యక్తిగత జీవిత విషయానికొస్తే.. బెంగళూరుకి చెందిన ఈయన పారిశ్రామికవేత్త ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి ని 2022 నవంబర్ 20న పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. 

ఇకపోతే నాగశౌర్యకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అదేమిటంటే నాగశౌర్య త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నారట. ఈ విషయాన్ని కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే తెలియజేశారని, ఇంకా ఫ్రెండ్స్ కి కూడా తెలియదని సమాచారం. త్వరలోనే దీనిపై నాగశౌర్య అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.అంతేకాదు ఈ విషయం తెలిసి నెటిజన్స్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

హీరో నాగ శౌర్య విషయానికి వస్తే.. 'క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్'సినిమాలో మొదటిసారి నటించారు.  జాతీయ బహుమతి పొందిన తెలుగు సినిమా చందమామ కథలు సినిమాలో కూడా హాస్య పాత్రను పోషించారు. రామయ్య వస్తావయ్యా వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈయన, ఏలూరులో జన్మించారు. ఆ తర్వాత విజయవాడకు షిఫ్ట్ అయ్యారు.  

సినిమాలలో నటించాలని తన కోరికను నెరవేర్చుకోవడానికి హైదరాబాదుకి వచ్చి, సినీ రంగాని కంటే ముందు టెన్నిస్ బాగా ఆడేవాడు. మొదటి పాత్రలో నటించే ముందు ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు. నటశిక్షకుడు ఎన్ జే భిక్షు దగ్గర శిక్ష కూడా తీసుకున్నారు. 2017 లో నిహారిక కొణిదెలతో కలిసి ఒక మనసు సినిమాలో నటించి,  ఆ తర్వాత కల్యాణ వైభోగమే సినిమాలో కూడా మంచి గుర్తింపు అందుకున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link