Porcupine vs Leopard: చిరుతపులిని ఒక ఆటాడుకున్న ముళ్లపంది.. వైరల్ ఫోటోస్!
కొన్ని రోజుల క్రితం మారియెట్ ల్యాండ్‌మన్ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ (Wildlife Photographer) దక్షిణాఫ్రికాలోని (South Africa) క్రుగర్ నేషనల్ పార్క్ (Kruger National Park) లో సంచరిస్తున్నాడు.. అక్కడ జరిగిన ఒక ఘటన అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకేం ఉంది తన కెమెరాకి పని చెప్పాడు.. (Leopard Attacked Porcupine)
Photo Credit: The Sun
ముళ్లపంది చర్మం పై పొడవైన ముళ్లు ఉంటాయని అందరికి తెలిసిందే... ఈ చిన్న జంతువు చిరుత పులి నుండి తనను తాను రక్షించుకోటానికి శరీరంపై ఉండే ముళ్లను ఉపయోగించింది (Leopard Attacked Porcupine). ముళ్లపందికి తన చర్మంపై ఉండే ముళ్లు (Pricky Skin) తనను తానూ రక్షించటమే కాకుండా, ప్రత్యర్థిని గాయపడేలా చేసి తప్పించుకుంది.
దాడి చేసిన తరువాత చిరుత పులి నోటి నిండ ముళ్లతో నిండిపోయింది... వివరాలు తెలిపిన ఫోటోగ్రాఫర్ ప్రకారం 90 నిమిషాల పాటు రెండు జంతువుల (Porcupine Leopard Fight) మధ్య పోరాటం జరిగిందని... తన జీవితంలో ఇలాంటి పోరాటం చూడలేదని తెలిపాడు.
దాదాపు 90 నిమిషాలు పోరాటంలో (Weird Fight), చిరుతపులి నోట్లో చిక్కుకున్న ముళ్లను తీడుకోటానికి చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ.. గాయాలతో వెనుతిరిగింది. తరువాత రెండు జంతువులు ఎవరిదారిన వారు వెళ్ళారని.. ఇదొక ప్రత్యేకమైన పోరాటమని వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ మారియెట్ ల్యాండ్‌మన్ తెలిపారు.