Post Office: ఈ పోస్టు ఆఫీస్‌ పథకంలో పెట్టుబడి పెడితే రూ. 80,000 వడ్డీ వస్తుంది..

Tue, 02 Jul 2024-11:28 am,

Post Office Scheme: చాలామంది తమ డబ్బులు డబుల్‌ చేసుకోవడానికి రకరకాల సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా స్టాక్‌ మార్కెట్‌, ఎఫ్‌డీల్లో పెట్టుబడులు పెడతారు. కానీ, ఇందులో రిస్క్‌తో కూడుకున్నవి. అయితే, ఏ రిస్క్‌ లేకుండా ప్రభుత్వ పథకంలో పెట్టుబడ పెట్టాలనుకుంటున్నారా? దీనికి గ్యారెంటీ రిటర్న్‌ కావాలనుకుంటున్నారా?  

 మీకు ఓ అద్బుతమైన ప్రభుత్వ పథకాన్ని ముందుకు తీసుకువస్తున్నాం. దీంతో గ్యారెంటీ హామీతోపాటు వడ్డీ కూడా వస్తుంది. పైగా ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బు కూడా డిపాజిట్‌ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ జీతంలో నెలనెలా కొద్దిమొత్తంలో జమా చేస్తే సరిపోతుంది. దీనికి మీకు రూ. 80,000 వరకు వడ్డీ వస్తుంది.  

ఈ స్కీమ్‌ ద్వారా మీరు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.. ఈ పథకంలో ఎలా పెట్టుబడులు పెట్టాలో.. ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టాలో తెలుసుకుందాం. ఇది రికరింగ్‌ డిపాజిట్‌ ఈ ఖాతాను మైనర్‌ పై కూడా ఓపెన్‌ చేయవచ్చు.  

మీ జీతంలో నుంచి ప్రతినెలా రూ. 7000 జమా చేశారంటే ఐదు సంవత్సరాలకు అది రూ. 4,20,000 అవుతుంది. ఇందులో కనీసం రూ. 100, గరిష్టంగా ఎంతైనా డిపాజిట్‌ చేసుకోవచ్చు. దీనిపై వడ్డీ రూ. 79,564 వడ్డీ లభిస్తుంది. దీంతో అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ. 4,99,564 లభిస్తుంది.  

ఒకవేళ మీరు నెలనెలా రూ. 5000 డిపాజిట్‌ చేస్తే ఏడాదికి రూ. 60,000 అవుతుంది. ఐదేళ్లకు మూడు లక్షలు అవుతుంది. దీనికి రూ. 56,830 వడ్డీ లభిస్తుంది. మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 3,56,830 లభిస్తుంది. అయితే, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆర్‌డీ పథకం కింద వడ్డీపై టీడీఎస్‌ను కట్‌ చేస్తుంది. ఐటీఆర్‌ తర్వాత వీటిని రీఫండ్ చేసుకోవచ్చు. మీరు పదివేల కంటే ఎక్కువ వడ్డీ పొందిత టీడీఎస్‌ కట్‌ అవుతుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link