Post Office Bumper Scheme: 60 కోట్ల మందికి అదిపోయే పోస్టాఫీస్ స్కీమ్.. ఖాళీగా కూర్చుని నెలకు రూ.20 వేలు పొందండి!
ఈ ప్రత్యేకమైన పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టేవారికి.. కట్టడానికి సంబంధించిన పరిమితకాలం ముగిసిన తర్వాత దాదాపు రూ.20వేలకు పైగా ప్రతి నెల పొందవచ్చు.
ఉద్యోగాలు చేసేవారు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక, పదవి విరమణ తర్వాత ఖాళీ చేతులతో ఉంటారు. అయితే ఇలాంటి వారికి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎంతగానో సహాయపడుతుంది.
ఈ పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా పదవీ విరమణ తర్వాత ప్రతి నెల పెన్షన్ పొందవచ్చు. అంతేకాకుండా ఇది మీకు స్థిర ఆదాయంగా అందడం వల్ల ఖర్చులకు కూడా పనికొస్తాయి.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి పెట్టేవారికి మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లుగా ఉంటుందని పోస్టాఫీస్ అధికారులు తెలిపారు. అలాగే ఇందులో పెట్టుబడి పెట్టే సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా వడ్డీ రేటు 8.2 శాతం వరకు వస్తుంది.
8.2 శాతం వరకు వడ్డీ రేటుతో దాదాపు ఒక్కొక్క సీనియర్ సిటిజన్‌కు ప్రతి నెల రూ.20 వేల వరకు ఖాళీగా కూర్చుని పొందవచ్చు. అంతేకాకుండా ఈ డబ్బులను ఇంటి ఖర్చులకు కూడా బాగా వాడుకోవచ్చు.
SCSS పథకంలో కేవలం మనం పెట్టే పెట్టుబడి రూ.15 లక్షలు మాత్రమే కాగా.. వడ్డీతో దాదాపు రూ.30 లక్షల వరకు చేతికి వస్తుంది. అంటే దాదాపు రూ.2,46,000 వడ్డీ వస్తుంది. అంటే దాదాపు ప్రతి నెల రూ. 20 వేలు పొందవచ్చు.