Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ సూపర్ హిట్ స్కీమ్.. ఇలా చేస్తే ప్రతినెలా రూ.20,500 పొందే బంపర్ ఛాన్స్..!
మీరు కష్టపడి సంపాదించిన డబ్బును భద్రంగా దాచుకుని దాని ద్వారా ప్రతి నెలా ఆదాయం పొందాలి అనుకుంటున్నారా? ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అద్భుతం. ఈ పథకంలో మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే దానిపై ప్రతినెలా రూ.20,500 వడ్డీ పొందుతారు.
సీనియర్ సిటిజెన్ల కోసం ఈ అద్భుతమైన స్కీమ్‌ను పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి నెలా రూ.20,000 పొందవచ్చు. దీని మెచ్యురిటీ గడువు ఐదేళ్లు, ఇందులో మీరు 8.2 శాతం వడ్డీ అందుకుంటారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ పథకం ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ అందించడం లేదు.
భారతీయులు ఎవరైనా సరే ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా వారి వయస్సు 60 ఏళ్లు దాటినవారు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఈ పథకాన్ని సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అని పిలుస్తారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఈ పథకంలో పెట్టుబడి పెడితే మీకు ప్రతినెలా ఎక్కువ మొత్తంలో వడ్డీ లభిస్తుంది.
ఈ ఎస్‌సీఎస్‌ఎస పథకంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు అర్హులు. ఒక వేళ ఉద్యోగి అయితే, వారి వయస్సు 55-60 ఏళ్ల మధ్యలో ఉన్నవారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకం మీ దగ్గరలో ఉన్న ఏ పోస్ట్ ఆఫీస్ బ్రాంచీలో అయినా అందుబాటులో ఉంటుంది. అక్కడ మీరు మరిన్ని వివరాలు ఈ పథకం గురించి తెలుసుకోవచ్చు.
కానీ, ఈ పథకంలో చేరినవారు డిపాజిట్ చేసిన డబ్బుపై ట్యాక్స్ కూడా చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. కొన్ని నిబంధనలతో ట్యాక్స్ తగ్గించే అవకాశం కూడా ఉంది. ఈ పథకంలో గరిష్ట మొత్తంలో మీరు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రస్తుతం ఈ లిమిట్ రూ.30 లక్షలకు పెంచారు. ఒక వేళ సీనియర్ సిటిజెన్లు ఈ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే ఏడాదికి వడ్డీ రూ.2,46,000 పొందుతారు. అంటే ప్రతినెలా మీరు వడ్డీ రూపంలో రూ.20,500 అందుకుంటారు.