Potato Chips Side Effects: ఆలూ చిప్స్ అతిగా తింటున్నారా? యమ డేంజర్ రా నాయన..
చాలా మంది స్నాక్‌గా ప్రతి రోజు అతిగా ఆలూ చిప్స్ తింటున్నారు. నిజానికి ఇలా తినడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా అతిగా తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఆలూ చిప్స్‌లో కేలరీలు, చెడు కొవ్వు పరిమాణాలు అతిగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా హాని కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఇందులో ఉండే మూలకాలు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా సులభంగా పెంచుతుంది.
ఆలూ చిప్స్‌లో ఉండే చెడు కొలెస్ట్రాల్, ఉప్పు రక్తపోటును పెంచి గుండె జబ్బులకు దారీ తీయోచ్చు. అంతేకాకుండా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి అతిగా చిప్స్ తినడం మానుకోండి.
ఆలూ చిప్స్‌లో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి షుగర్ వ్యాధికి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే మధుమేహం ఉన్నవారు చిప్స్ తినడం మానుకోండి.
రోజు అలూ చిప్స్ తినడం వల్ల కొంతమందిలో జీర్ణక్రియ సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలకు కూడా తలెత్తుతాయి.
ఆలూ చిప్స్‌లో పోషక విలువలు చాలా తక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి అతిగా ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఇతర పోషకాలు లభించవు. దీని కారణంగా పోషకలోపం వంటి సమస్యలు కూడా రావచ్చు.