PSU Stock: ఈ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన స్టాక్ లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6 లక్షలు మీ సొంతం

Thu, 22 Aug 2024-12:26 pm,

PSU STOCKS TO BUY: స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా. అయితే మంచి స్టాక్స్ కోసం వెతుకుతున్నారా..ఈ నేపథ్యంలో ఒక ప్రభుత్వ రంగ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాని పేరే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ స్టాక్ ప్రస్తుతం 515 వద్ద ట్రేడ్ అవుతోంది. సంవత్సరాలుగా తన ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ లాభాలను అందించింది. 

గత సంవత్సరం ఆగస్టు 22వ తేదీ ఈ స్టాక్ ధర 218 రూపాయలుగా ఉంది. కానీ ప్రస్తుతం సరిగా ఏడాదికి తిరిగిన తర్వాత ఆగస్టు 22, 2024వ సంవత్సరానికి ఈ స్టాక్ ధర 515 రూపాయలకు చేరింది. అంటే ఒక సంవత్సర కాలంలో దాదాపు 135 శాతం పెరిగింది అని అర్థం. ఇక ఈ స్టాక్ గడచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు 532 శాతం లాభం అందించింది.   

ఈ స్టాక్ ధర సరిగ్గా 2019 ఆగస్టు 22వ తేదీన కేవలం 81 రూపాయలు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 515 రూపాయలు దాటింది. అంటే సుమారు ఈ స్టాక్ 5 సంవత్సరాలలో 532 శాతం పెరిగింది.  పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టాక్ లో ఎవరైనా ఒక లక్ష రూపాయలను 2019 వ సంవత్సరంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ప్రస్తుతం 6 లక్షల రూపాయల పైన లాభం ఇచ్చి ఉండేది. 

 పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ( PFC) అనేది కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ సర్వే ప్రకారం PFC 8వ అత్యధిక లాభాలను ఆర్జించే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ కంపెనీగా పేరు పొందింది.  2021 సంవత్సరం PFC హోదాను ' నవరత్న ' నుండి ' మహారత్న'కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

1986లో స్థాపించిన ఈ సంస్థ భారతీయ విద్యుత్ రంగానికి చెందిన సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ సంస్థ  నికర విలువ 1.184 లక్షల కోట్లుగా ఉంది.  అలాగే కార్పొరేషన్ తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కూడా ప్రకటించింది. 7,182.06 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న దానికంటే 20 శాతం ఎక్కువ. క్యూ1 రూ.21,017.81 కోట్లతో పోలిస్తే మొత్తం ఆదాయం రూ.24,736.68 కోట్లుగా ఉంది. (Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link