Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్.. ఈశ్వీర్ మూవీ రీరిలీజ్
రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. నీ చేతిలో డబ్బుంటే.. నా ఛాతిలో దమ్ముంది అంటూ ప్రభాస్ చెప్పిన మాస్ డైలాగ్స్ అదిరిపోయాయి.
తొలి సినిమాలో రెబల్ స్టార్ యాక్షన్ సీక్వెన్స్, కామెడీ, రొమాంటిక్ సాంగ్స్ ఇలా అన్ని కలిపి ట్రైలర్‌ను కట్ చేశారు.
జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కె.అశోక్ నిర్మించారు.
ప్రస్తుతం ఈ మూవీని ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ నరసింహా మూవీస్ రీరిలీజ్ చేస్తోంది.
ప్రభాస్‌కు ఇప్పుడు పెరిగిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈశ్వర్ మూవీని థియేటర్‌లలో ఎంజాయ్ చేయలేకపోయారు. ఇప్పుడు 4Kతో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.