Prabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్‌డేట్.. అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న రెబల్ స్టార్

ప్రభాస్ పెళ్లి వార్త కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. గతేడాది పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చినా.. ప్రచారానికే పరిమితమైంది.

తాజాగా కృష్ణం రాజు భార్య శ్యామల దేవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతి త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఆమె చెప్పారు.

విజయవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు శ్యామల దేవి వచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పారు.
దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయం సన్నిధిలో నిర్వహిస్తున్న లక్ష కుంకుమార్చన పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న శ్యామల దేవి కి ఆలయ అర్చకులు ఆశీర్వచనం నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. దుర్గమ్మ దర్శనానికి రావటం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఆలయానికి వస్తానని.. కృష్ణం రాజు గారికి దుర్గమ్మ అంటే చాలా ఇష్టమని ఇక్కడికి వస్తే ఆయనే గుర్తుకి వస్తారని అన్నారు.
తాను ఎప్పుడు రాజకీయాల్లోనే ఉన్నానని.. బీజేపీ అధిష్టానం ఏ పదవి ఇచ్చిన సంతోషంగా నిర్వహిస్తానని చెప్పారు.
అతి త్వరలో ప్రభాస్ పెళ్లి జరగబోతుందని దుర్గమ్మ సన్నిధిలో తీపికబురు చెప్పారు.