Prabhas Rare Record: మన దేశంలో ఆ రికార్డు ఉన్న ఏకైక హీరో ప్రభాస్.. ఇదిగో ప్రూఫ్..
టాలీవుడ్ లోనే కాదు.. మన దేశంలోనే ప్రభాస్ నటించిన ఈ సినిమాల కలెక్షన్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మరే తెలుగు సహా మన దేశంలో మరే హీరోకు ఈ రేంజ్ రికార్డు లేదనే చెప్పాలి.
రెబల్..
రెబల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయినా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 10లో నిలిచింది.
మిస్టర్ పర్ఫెక్ట్..
ప్రభాస్ హీరోగా నటించిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లతో రాబట్టి టాప్ 9లో నిలిచింది.
మిర్చి.. కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 87 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ 8లో నిలిచింది.
రాధే శ్యామ్..
రాధే శ్యామ్ మూవీ డిజాస్టర్ గా నిలిచినా.. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 7లో నిలిచింది.
ఆదిపురుష్..
ప్రభాస్ రాఘవగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 6లో నిలిచింది.
సాహో.. సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కిన మూవీ ‘సాహో’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ 5 లో ఉంది.
సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్ల గ్రాస్ వసూల్లతో టాప్ టాప్ 4 లో ఉంది.
బాహుబలి -1.. ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన బాహుబలి పార్ట్ -1 సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 650 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 3లో నిలిచింది.
కల్కి 2898 AD.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’ మూవీ. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.1111 కోట్ల గ్రాస్ వసూళ్ల ను రాబట్టింది.
బాహుబలి 2 - ది కంక్లూజన్..
ప్రభాస్ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2 - ది కంక్లూజన్’ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ ప్లేస్ లో ఉంది.